Jangaon: సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డ పల్లా, ఎర్రబెల్లి!
Jangaon: జనగామలో జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటిలపై తీవ్రస్థాయిలో మండిపడిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
Jangaon: సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డ పల్లా, ఎర్రబెల్లి!
Jangaon: హిట్లర్ తన అభిమాన నాయకుడు అని ప్రకటించుకున్న రేవంత్ రెడ్డి, హిట్లర్ ను ఆదర్శంగా తీసుకుని తెలంగాణ ప్రజలను గోస పెడుతుండని, ఆ హిట్లర్ కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పట్టబోతుందని అన్నారు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, నేడు జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్బంగా జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో వేడుకలను ఏర్పాటు చేయగా వేడుకలకు వారు హాజరై జాతీయ జెండా, పార్టీ జెండాను ఎగురవేసి అమరవీరులకు నివాళులు అర్పించారు కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కాసిం రాజ్వి వారసుడు రేవంత్ రెడ్డి అని, ఆనాడు కాసిం రాజ్వికి పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుందని, హిట్లర్ కాలంలో గోబెల్స్ ప్రచార శాఖ మంత్రిగా ఉండి హిట్లర్ అగాయిత్యాలకు ప్రజలు తిరగబడటం చూసి భయపడి ఆత్మహత్య చేసుకున్నాడని గోబెల్స్ లాగానే ఇప్పుడు ప్రచార శాఖ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి గోబెల్స్ కి పట్టిన గతే పడుతుందన్నారు, వంద రోజులలో సంక్షేమ పథకాలు చేసి చూపిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి 1000 రోజులైనా ఒక్క హామీ నెరవేర్చింది లేదని, 1000 రోజుల పాలనలో ప్రజలను చేసిన మోసానికి ప్రజలే వెయ్యి అడుగుల గోతిలో పాతి పెడతారన్నారు.
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ జనగామ జిల్లా పోరాటం ఫలితంగానే ఆనాడు నిజాం నవాబులు తోక ముడిచారని, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, సర్దార్ సర్వాయి పాపన్న లాంటి ఎంతో మంది వీరులు తమ రక్తాన్ని చిందించారన్నారు, కెసిఆర్ కృషితోనే తెలంగాణ లో సాగునీరు, కరెంటు నిండుగా వచ్చిందని, కాంగ్రెస్ పాలనలో మళ్ళీ పాత రోజులు వస్తున్నాయన్నారు, సిగ్గులేని రేవంత్ రెడ్డి సోయి లేకుండా ఏం మాట్లాడుతున్నడని, నువ్వెంది నీ బ్రతుకేంది ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకుని బ్రతికిన నువ్వు నీ కుటుంబం కబ్జాలు చేసి వేల ఎకరాలు సంపాదించి రాజకీయం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు, మేము మా తాతలు, తండ్రులు సంపాదించిన భూములను అమ్ముకొని రాజకీయం చేశామని, నేను భూకబ్జా చేసినట్టు ఐతే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని, నాతో పాటు రేవంత్ కుటుంబ సభ్యులఫై కూడా విచారణ జరిపించాలని ఒకవేల నేను భూకబ్జా చేసినట్టు తేలితే రాజకీయ సన్యాసం తిసుకుంటానని సవాల్ విసిరారు, మరో ఏడాదిలోనే తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డిని ఊరికించి కొడుతారని, పదవులను గడ్డి పూచల తీసేసే మనస్తత్వం మాది నీ మొఖానికి ఎప్పుడైనా రాజీనామా చేసావా రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు, తెలంగాణ రాష్టం కోసం రాజీనామా చేయాలి అంటే రేవంత్ రెడ్డి తప్పించుకొని పారిపోయాడని, ఆయన కుటుంబ సభ్యులది, తమ్ముళ్లది కాంగ్రెస్ పార్టీ బండారం అంత త్వరలోనే బయట పెడతామని అన్నారు.




