Palakurthi: పట్టభద్రులు వెంటనే ఓటు నమోదు చేసుకోవాలి: ఎమ్మెల్యే యశస్విని!
Palakurthi: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు నవంబర్ 6 చివరి గడువని, అర్హులందరూ నమోదు చేసుకోవాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పిలుపునిచ్చారు.
Palakurthi: పట్టభద్రులు వెంటనే ఓటు నమోదు చేసుకోవాలి: ఎమ్మెల్యే యశస్విని!
పాలకుర్తి: జనగామ జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియకు ఈ నెల 6వ తేదీ చివరి గడువు కావడంతో అర్హులైన పట్టభద్రులందరూ వెంటనే తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి పిలుపునిచ్చారు.
పాలకుర్తి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కోసం ఏర్పాటు చేసిన ఉచిత ఓటరు నమోదు కేంద్రాన్ని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సందర్శించారు.ఈ సందర్భంగా కేంద్రంలో కొనసాగుతున్న ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించి,నమోదు కోసం వచ్చిన పట్టభద్రులతో మాట్లాడారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చేపడుతున్న కార్యక్రమాల గురించి పార్టీ నాయకులు,కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియకు సమయం చాలా తక్కువగా ఉందని,ఈ నెల 6వ తేదీతో గడువు ముగియనున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్, NSUI నాయకులు ఈ కార్యక్రమంలో బాధ్యతాయుతంగా భాగస్వాములై ఓటరు నమోదు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కోరారు.




