Hanamkonda: హసన్‌పర్తిలో ఘనంగా పద్మశాలీల కార్తీక వనభోజన మహోత్సవం!

Hanamkonda: హసన్‌పర్తి ఎర్రగట్టు ఆలయంలో ఆదివారం పద్మశాలీల కార్తీక వనభోజన మహోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా ఈగ మల్లేశం పాల్గొని ఐక్యతకు పిలుపునిచ్చారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 29 Nov 2026 8:00 PM IST
Hanamkonda
X

Hanamkonda: హసన్‌పర్తిలో ఘనంగా పద్మశాలీల కార్తీక వనభోజన మహోత్సవం!

హన్మకొండ జిల్లా: హసన్‌పర్తిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం హన్మకొండ జిల్లా అధ్యక్షులు బచ్చు ఆనందం మరియు వారి కార్యవర్గ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పద్మశాలి కులబాంధవుల కార్తీక మాస వనభోజన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అఖిల భారత పద్మశాలి సంఘం పూర్వ జాతీయ అధ్యక్షులు, కేంద్ర ఖాదీ మరియు చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ శ్రీ ఈగ మల్లేశం గారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పద్మశాలీలందరూ ఒకే వేదికపైకి రావడం మన ఐక్యతకు నిదర్శనమని, భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ఏకైక కులం పద్మశాలి కులమని, ఏ రాష్ట్రానికి వెళ్లినా మన కులబాంధవులు అక్కున చేర్చుకుంటారని గుర్తుచేశారు. హిందూ సంప్రదాయాలను, సంస్కృతిని కఠినంగా పాటించే సమాజం మనదని కొనియాడారు.భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పద్మశాలి కులస్తులు ముందువరుసలో నిలిచి పోరాడారని, ఎంతో చైతన్యం కలిగిన మన సమాజం నేడు అంతర్గత తారతమ్యాలను పక్కనపెట్టి ముందుకు సాగాలని సూచించారు.

ఉపాధి కోసం సూరత్, భివండి, సోలాపూర్, మహారాష్ట్ర వంటి సుదూర ప్రాంతాలకు వలస వెళ్లిన మన సోదరులందరినీ పిలిపించి నమోదు చేయించడం వల్ల మన జనాభా 9.2 శాతం నుండి 13.2 శాతానికి పెరిగిందని ఆయన గుర్తుచేశారు.ఎవరో వచ్చి మనకు పదవులు ఇస్తారని ఎదురుచూడకుండా, మన జనాభా బలం, ఐక్యతతో కొట్లాడి రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలని, అప్పుడే మన సమస్యలు పరిష్కారమవుతాయని స్పష్టం చేశారు.

జనాభాకు తగ్గట్టుగా రాజకీయ వాటా, రాజ్యాధికారం సాధించుకున్నప్పుడే మన సమస్యలు పరిష్కారమవుతాయని, ఆ బాధ్యత నేటి యువతీ యువకుల పై ఉందని స్పష్టం చేశారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన టెక్స్‌టైల్ పార్కులు మడికొండ, గీసుగొండ తదితర ప్రాంతాలు ప్రయోజనాలను సద్వినియోగం చేసుకుంటూ స్థానికంగానే ఉపాధి పొందాలని కోరారు.

ఈ వనభోజన వేడుకలకు పురుషుల కంటే మహిళలే అధిక సంఖ్యలో రావడం చైతన్యానికి నిదర్శనమని అభినందించారు. మహిళా సమాఖ్యలను నిర్మించుకుని ఆర్థికంగా ఎదగాలని, భవిష్యత్తులో మహిళలు ఎమ్మెల్యేలుగా కూడా ఎదగాలని ఆకాంక్షించారు. వచ్చే ఏడాది మహిళల నాయకత్వంలోనే ఈ వేడుకలను నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో, మండలంలో పద్మశాలి కులబాంధవులు చిన్న మొత్తాలతో పొదుపు మరియు పరపతి సంఘాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దీనివల్ల ఆర్థిక బలం చేకూరి, పేద కులబాంధవుల ఇళ్లలో జరిగే పెళ్లిళ్లు, శుభకార్యాలు లేదా ఆపద సమయాల్లో సంఘం తరపున ఆర్థిక సాయం అందించి ఆదుకోవచ్చని తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లాలోని 14 మండలాల నుండి పద్మశాలి కులబాంధవులు, మహిళలు, యువత, చిన్నపిల్లలు వేలాదిగా తరలిరావడంతో ఎర్రగట్టు ప్రాంగణం పసుపుమయమైంది. "జై మార్కండేయ.. జై పద్మశాలి" అంటూ నినాదాలతో భారీ శోభాయాత్ర (ర్యాలీ) నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య జెండా ఆవిష్కరణ చేసి, కులదైవమైన శ్రీ మార్కండేయ మహర్షికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనాలు అందుకున్నారు.

అనంతరం కమలాపూర్ చేనేత సంఘం కార్యవర్గం వారు మార్కండేయునికి హసన్ పర్తి గ్రామం నుండి ఎర్రగట్టుగుట్ట వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు ట్రాక్టర్ మీద మగ్గం పెట్టి నేసిన శాలువాతో ఈగ మల్లేశం గారిని ఘనంగా సన్మానించారు. తర్వాత హనుమకొండ పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు బచ్చు ఆనందం మరియు వారి కార్యవర్గ సభ్యులు కలిసి ప్రత్యేక శాలువా, మెమంటోతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ గుండు సుధారాణి, అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుండు ప్రభాకర్, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షులు బచ్చు ఆనందం, రాష్ట్ర ఉపాధ్యక్షులు వద్నాల నరేందర్, వైద్య రాజగోపాల్, ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ వేముల నాగరాజ, ఐజేయు జిల్లా అధ్యక్షులు గడ్డం కేశవామూర్తి, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తవుటం ఝాన్సీ రాణి, రాష్ట్ర కార్యదర్శి తవుటం రవీందర్,రాష్ట్ర కోఆర్డినేటర్ పులికంటి రాజేందర్, రాష్ట్ర కార్యదర్శి వెంగళ వేణు గోపాల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొప్ప శివశంకర్,గుర్రపు కోటేశ్వర్, కేదాశి వెంకటేశ్వర్లు, రాకేష్, చెరుకు ఎల్లయ్య దంపతులు, దేవులపల్లి సదానందం, సంతోష్. సందీప్, సతీష్, సురేందర్, పద్మశాలి కులస్తులు, పరపతి సంఘాల అధ్యక్షులు,పలు మండలాల అధ్యక్షులు మరియు పద్మశాలి కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్