Hanamkonda: ఓరుగల్లు చిల్డ్రన్స్ అవార్డు - 2026 పోస్టర్ ఆవిష్కరణ
Hanamkonda: హన్మకొండలో 'ఓరుగల్లు చిల్డ్రన్స్ అవార్డు - 2026' పోస్టర్ను ఈగ మల్లేశం ఆవిష్కరించారు. నవంబర్ 15న పబ్లిక్ గార్డెన్లో ఈ వేడుకలు జరగనున్నాయి.
Hanamkonda: ఓరుగల్లు చిల్డ్రన్స్ అవార్డు - 2026 పోస్టర్ ఆవిష్కరణ
హన్మకొండ: హన్మకొండ పట్టణం బాలసముద్రంలోని ఎన్టీఆర్ ప్రాంగణంలో జే.బి కల్చరల్ ఆర్ట్స్ సొసైటీ నిర్వహిస్తున్న సకల కళల సంబరాల జాతరలో భాగంగా చాచా నెహ్రూ జయంతి మరియు బాలల దినోత్సవం పురస్కరించుకుని పబ్లిక్ గార్డెన్ లోని పద్మశ్రీ డా॥ నేరెళ్ళ వేణుమాధవ్ కళా ప్రాంగణంలో ఈనెల 15వ తేదీన జరగనున్న ఓరుగల్లు చిల్డ్రన్స్ అవార్డు - 2026 పోస్టర్ ను ఆవిష్కరించిన ఉభయ తెలుగు రాష్ట్రాల కళాకారుల సంక్షేమ మండలి అధ్యక్షులు మరియు కేంద్ర ఖాదీ మరియు చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ శ్రీ ఈగ మల్లేశం గారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
నేటి బాలలే రేపటి కళాకారులని చిన్నారులలో దాగి ఉన్న సృజనాత్మకతను, కళా నైపుణ్యాలను వెలికితీయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని అన్నారు. గత 23 సంవత్సరాలుగా నిరంతరాయంగా బాలల దినోత్సవ వేడుకలను నిర్వహిస్తూ చిన్నారులను ప్రోత్సహిస్తున్న సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జడల శివ కృషి ఎంతో అభినందనీయమని అన్నారు. ఈ నెల 15వ తేదీన జరగనున్న ఈ వేడుకల్లో బాలబాలికలు అధిక సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలి అని పిలుపునిచ్చారు.
ఈ అవార్డ్స్ కార్యక్రమం ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బాలబాలికలు, గురువులు మరియు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని కోరారు.
ఈ కార్యక్రమంలో జడల శివ, హరిత, ఎం. చంద్రమౌళి, హిందీ శ్యామ్, పి. భుజంగరావు, పిట్టల జ్యోత్స్న, రాయబారపు ప్రసాద్, ఎం. చందన, సంపత్ రావు, సంపత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.




