Warangal: ఆర్.ఎస్. నగర్‌లో వేలాడుతున్న విద్యుత్ వైర్ల సమస్యకు పరిష్కారం!

Warangal: 36వ డివిజన్ ఆర్.ఎస్. నగర్‌లో ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ వైర్ల సమస్యను బీజేపీ నేత ఆడెపు వెంకటేష్ చొరవతో విద్యుత్ శాఖ అధికారులు క్లాంపులు వేసి పరిష్కరించారు.

MD. AMEER, WARANGAL EAST
Published on: 18 Nov 2026 11:10 AM IST
Warangal
X

Warangal: ఆర్.ఎస్. నగర్‌లో వేలాడుతున్న విద్యుత్ వైర్ల సమస్యకు పరిష్కారం!

Warangal: 36వ డివిజన్ ఆర్.ఎస్. నగర్‌లో విద్యుత్ స్తంభాల వద్ద వైర్లు ప్రమాదకరంగా వేలాడుతూ స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి.

ఈ విషయాన్ని తెలుసుకున్న బీజేపీ సోషల్ మీడియా ఇంచార్జ్ ఆడెపు వెంకటేష్ వెంటనే స్పందించి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి విజ్ఞప్తి చేశారు.

విజ్ఞప్తికి స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించి, వేలాడుతున్న వైర్లకు క్లాంపులు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించారు.

ప్రజలకు ఎదురయ్యే ప్రతి సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా కృషి చేయడమే తమ బాధ్యత అని, ప్రజల భద్రతే తమ ప్రాధాన్యత అని వారు తెలిపారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST