Hanumakonda: మునిసిపల్ కంప్యూటర్ ఆపరేటర్ల రాష్ట్ర అధ్యక్షుడిగా మియాపురం శ్రీకాంత్ ఎన్నిక!

Hanumakonda: హన్మకొండలో జరిగిన సమావేశంలో తెలంగాణ మునిసిపల్ అవుట్‌సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్స్ అసోసియేషన్ నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా మియాపురం శ్రీకాంత్ ఎన్నికయ్యారు.

MD. AMEER, WARANGAL EAST
Published on: 2 Oct 2026 7:56 PM IST
Hanumakonda
X

Hanumakonda: మునిసిపల్ కంప్యూటర్ ఆపరేటర్ల రాష్ట్ర అధ్యక్షుడిగా మియాపురం శ్రీకాంత్ ఎన్నిక!

Hanumakonda: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వివిధ మునిసిపల్ కార్యాలయాల్లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు హన్మకొండ పబ్లిక్ గార్డెన్‌లో సమావేశమై తెలంగాణ మునిసిపల్ అవుట్‌సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్స్ అసోసియేషన్ నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడిగా మియాపురం శ్రీకాంత్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం రాష్ట్ర కమిటీలోని వివిధ పదవులకు నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు.

నూతన రాష్ట్ర కమిటీ వివరాలు:

రాష్ట్ర అధ్యక్షుడు: మియాపురం శ్రీకాంత్, ఉపాధ్యక్షురాలు: పి. గాయత్రి, కార్యదర్శులు: వరయోగుల నరేష్, ధరణికోట సంతోష్,

కోశాధికారి: బేలా చరణ్ కుమార్, సహ కోశాధికారులు: రంగు యుగేందర్, సంయుక్త కార్యదర్శులు: వి. మారుతి, సకినాల నాగరాజు మరియు నాయకం గంగాధర్, వర్కింగ్ ప్రెసిడెంట్లు: ఎస్. మాధవి, ఉస్మాన్ పాషా, పూజారి కిరణ్, అధికార ప్రతినిధి: తాత్తరి లింగనాథ్,

ముఖ్య సలహాదారులు: బి. వెంకట రంగ నెహ్రూ, ఎం.డి. ఖాజా, నాగ కిరణ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు: ఆర్. ప్రశాంత్ బాబు, ఎన్. నరేష్,ఎం మీడియా కన్వీనర్లు: ఎం.డి. ఇబ్రహీం అలీ, వి. హరీ.

ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, రాజేష్, మహేష్ కుమార్, క్రాంతి కుమార్, జగదీశ్వర్ రెడ్డి, విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మునిసిపల్ కార్యాలయాల్లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ల సమస్యలను ఐక్యంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, ఉద్యోగుల హక్కులు, వేతన భద్రత, ఉద్యోగ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా కృషి చేయడం నూతన కమిటీ ప్రధాన లక్ష్యాలుగా నిలవనున్నాయి.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST