Narsampet: 1,187 మందికి చేయూత పెన్షన్ల పంపిణీ ఎమ్మెల్యే దొంతి

Narsampet: నర్సంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కలెక్టర్ సత్య శారద ఆధ్వర్యంలో 1,187 మందికి చేయూత పెన్షన్ల ప్రొసీడింగ్‌లను పంపిణీ చేశారు.

MD. AMEER, WARANGAL EAST
Published on: 14 Nov 2026 11:03 PM IST
Narsampet
X

Narsampet: 1,187 మందికి చేయూత పెన్షన్ల పంపిణీ ఎమ్మెల్యే దొంతి

నర్సంపేట: నర్సంపేట నియోజకవర్గంలో శనివారం నిర్వహించిన చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వివిధ వర్గాలకు చెందిన లబ్ధిదారులకు చేయూత పెన్షన్లు అందజేశారు. ఇందులో భాగంగా 133 మంది గీత కార్మికులకు, 130 మంది ఒంటరి మహిళలకు, 638 మంది వితంతువులకు ఒక్కొక్కరికి నెలకు రూ.2,016 చొప్పున, 286 మంది దివ్యాంగులకు ఒక్కొక్కరికి నెలకు రూ.4,016 చొప్పున పెన్షన్లు మంజూరయ్యాయి.

మొత్తం 1,187 మంది లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి మాట్లాడుతూ..."పేదలు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు అండగా ఉండాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. చేయూత పింఛన్ ద్వారా నిరుపేద కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందేలా చూస్తాం. ఎవరూ అర్హత ఉండి పింఛన్ కు దూరం కాకూడదు" అని అన్నారు. ప్రభుత్వం వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు ప్రతి నెలా నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తోందని తెలిపారు.

గత ప్రభుత్వాల హయాంలో పింఛన్ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు.నర్సంపేట నియోజకవర్గంలో ఒక్క అర్హుడు కూడా మిగిలిపోకుండా గ్రామాల వారీగా సర్వే చేసి పింఛన్లు మంజూరు చేయిస్తాం. ఎవరికైనా సమస్య ఉంటే నేరుగా నా దృష్టికి తీసుకురావచ్చు" అని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ..."అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు తదితరులకు ఆర్థిక భరోసా కల్పించడమే చేయూత పింఛన్ల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీ వైవి గణేష్,మున్సిపల్ చైర్మన్ పెండెం లక్ష్మీ , వైస్ చైర్మన్ గంధపు నరేందర్, ఆర్డీవోఉమారాణి,డీఆర్డీవో నాగ పద్మజ , ఎమ్మార్వో రవి చంద్ర రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్ రావు మున్సిపల్ కమిషనర్ నరేష్ రెడ్డి, సంబధిత వార్డు కౌన్సిలర్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST