Kuravi: కురవి నాగేంద్ర స్వామి ఆలయంలో ఘనంగా నాగుల చవితి వేడుకలు

Kuravi: మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని నాగేంద్ర స్వామి ఆలయంలో నాగుల చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రత్యేక పూజలు చేశారు.

P PRABHAKAR, DORNAKAL
Published on: 13 Nov 2026 4:04 PM IST
Kuravi
X

Kuravi: కురవి నాగేంద్ర స్వామి ఆలయంలో ఘనంగా నాగుల చవితి వేడుకలు

మహబూబాబాద్ జిల్లా: కురవి మండల కేంద్రంలోని నాగేంద్ర స్వామి ఆలయంలో నాగుల చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని నాగేంద్ర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని పుట్టలో పాలు పోసి, పచ్చి తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

నాగుల చవితి సందర్భంగా నాగదేవతకు పూజలు చేసి పాలు సమర్పించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని, సంతాన భాగ్యం కలుగుతుందని, కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం సిద్ధిస్తాయని మహిళలు విశ్వసిస్తారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో కిటకిటలాడింది.

ఈ వేడుకల్లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కూడా పాల్గొన్నారు. నాగేంద్ర స్వామిని దర్శించుకుని పుట్టలో పాలు పోసి, నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులతో మాట్లాడారు. నాగుల చవితి వేడుకలు భక్తుల ఆధ్యాత్మిక సందడి మధ్య ఘనంగా ముగిశాయి.

P PRABHAKAR, DORNAKAL

P PRABHAKAR, DORNAKAL