Jangaon: ఉమ్మడి కుటుంబాలకు దర్పణం ‘నా జీవన ప్రయాణం’: ఆచార్య బలరాం

Jangaon: జనగామలో డాక్టర్ మాచర్ల రాములు ఆత్మకథ 'నా జీవన ప్రయాణం' పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ గ్రంథం ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు దర్పణమని వక్తలు కొనియాడారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 2 Oct 2026 7:48 PM IST
Jangaon
X

Jangaon: ఉమ్మడి కుటుంబాలకు దర్పణం ‘నా జీవన ప్రయాణం’: ఆచార్య బలరాం

జనగామ జిల్లా: ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు దర్పణం డాక్టర్ మాచర్ల రాములు ఆత్మకథ పుస్తకం "నా జీవన ప్రయాణం" అని విశ్రాంత ఆచార్యులు డాక్టర్ సిహెచ్ బలరాం అన్నారు. గురువారం ఉదయం జనగామలో జరిగిన పుస్తక ఆవిష్కరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

పట్టణ ప్రముఖులు సీనియర్ జర్నలిస్టు కన్నా పరశురాములు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలో ప్రొఫెసర్ బలరాం మాట్లాడుతూ తన శిష్యుడైన డాక్టర్ మాచర్ల రాములు వృత్తిలో ఏలాంటి మచ్చ లేకుండా పనిచేసి పదవి విరమణ పొందారని అన్నారు.

తన జీవన ప్రయాణంలో తాను చిన్నతనంలో అన్నలు వదినల దీవెనలతో మార్గదర్శనంలో మొదలైన తన ప్రస్థానం కష్టాలను గ్రామ చరిత్రను ఉటంకిస్తూ పుస్తకం రాయడం అభినంద నీయమని అన్నారు. నా జీవన ప్రయాణం పుస్తకాన్ని సభకు పరిచయం చేసిన విశ్రాంత లెక్చరర్ శ్రీభాష్యం విష్ణుచరణ్ మాట్లాడుతూ రాములు ప్రతిభా పాటవాలను కొనియాడారు.

చిన్నతనంలో గ్రామంలో అనుభవించిన అనుభవాలతో పాటు గ్రామ చరిత్రను తన జీవన ప్రస్థానంలో ఎదురైన విశేషాలను తమ కుటుంబ సభ్యుల ఐక్యత మమతాను రాగాలను ఉటంకిస్తూ రాసిన ఈ పుస్తకం ముందు తరాల వారికి ఆదర్శమని అన్నారు.

సభాధ్యక్షుడు కన్న పరశురాములు మాట్లాడుతూ డాక్టర్ మాచర్ల రాములు ఉత్తమ అధ్యాపకుడిగా రాణించిన ఆదర్శ అధ్యాపకుడని అలాగే సామాజికంగా "గోపా" సంస్థ జనగామ వ్యవస్థాపక కోశాధికారిగా సేవలందించి ఆ సంస్థ పురోభివృద్ధికి బీజాలు వేసిన బృందంలో వారు ఉండడం గొప్ప విశేషంగా కొనియాడారు. రాములు సారు శిష్యుడు ఉస్మానియా విశ్వ విద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య డి.

రవీందర్ మాట్లాడుతూ ఆయన వ్యక్తిత్వం కుటుంబ సభ్యులకు మాత్రమేకాక సమాజానికి ప్రత్యేకించి ఉమ్మడి కుటుంబాలకు ఆదర్శం అని అన్నారు. రాములు చిన్నతనం నుండి పురోభివృద్ధి చెందిన వైనాన్ని గుర్తు చేస్తూ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, అతిథులు ప్రసంగించారు.

అనంతరం రాములు జనమ్మ దంపతులను ఘనంగా సన్మానించారు. రాములు సారు ప్రతిభా పాటవాలను అభినందిస్తూ ప్రసంగించిన వారిలో డా. జి. సీతారాం, కుర్రెముల యాదగిరి, బి. శ్రీనివాస్, బూడిద జ్యోతి, ఎన్. నరేందర్ రెడ్డి, బి. వీరస్వామి, కటాక్షం, గడ్డం దశరథం, ఎన్ . మహేందర్ రెడ్డి పి హరిబాబు, మాచర్ల రామచంద్రం, నర్సింహులు, ప్రభాకర్, చంద్రమౌళి, కిషోర్, శ్వేత, సంధ్యా, రామకృష్ణ, విజయకుమార్, బాలరాజు తదితరులు ప్రసంగించారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON