Mahabubabad: కార్మికుల కాళ్లకు నమస్కరించి మానవత్వం చాటిన కౌన్సిలర్!
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేసి, వారి పాదాలకు నమస్కరించి ఘనంగా సత్కరించిన మున్సిపల్ కౌన్సిలర్ చిదిరాల అరుణ జ్ఞానేశ్వర్.
Mahabubabad: కార్మికుల కాళ్లకు నమస్కరించి మానవత్వం చాటిన కౌన్సిలర్!
Mahabubabad: మనసులను తాకిన మానవత్వం … పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు అందించి కార్మికుల పాదాలకు మున్సిపల్ కౌన్సిలర్ పాదాభివందనం నిర్వహించిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.
మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ మన ఆరోగ్యం కోసం తమ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా శ్రమించే పారిశుద్ధ్య కార్మికులు నిజమైన సమాజ సేవకులు అలాంటి కార్మికుల కష్టానికి గుర్తింపునిస్తూ, వారి సేవలకు మనస్ఫూర్తిగా పాదాభివందనం చేసి మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు మహబూబాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ చిదిరాల అరుణ జ్ఞానేశ్వర్ మహబూబాబాద్ పట్టణంలోని పేరాల కట్టయ్య ఫంక్షన్ హాల్‌లో శ్రీ లక్ష్మీ గణేష్, శ్రీ వాసవి సేవా సంస్థల సహకారంతో పారిశుద్ధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులకు దుస్తులు అందజేయడమే కాకుండా, వారి పాదాలకు నమస్కరించి గౌరవించడం అక్కడున్న వారిని భావోద్వేగానికి గురిచేసింది.
హోదాలు వేరు కావచ్చు… కానీ మనుషులందరూ సమానమేనని చాటిచెప్పిన ఈ ఘటన పలువురి హృదయాలను తాకింది.
ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్ చిదిరాల అరుణ జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ ప్రతిరోజూ తెల్లవారుజామునే విధుల్లోకి దిగి, వీధులను శుభ్రం చేస్తూ పట్టణ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషించే పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని వారి సేవలను గుర్తిస్తూ దుస్తులు పంపిణీ చేసి పాదాలకు అభివందనం చేసి అభినందించానన్నారు.
వారి శ్రమను గుర్తించి వారి ఆత్మగౌరవాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఆలాంటి సేవకుల పట్ల కృతజ్ఞతను మాటల్లోనే కాకుండా చేతల్లో చూపించినన్నారు.కార్మికుల చేతుల్లో దుస్తులు పెట్టడం ఒక సేవ అయితే వారి పాదాలకు నమస్కరించడం వారి శ్రమకు ఇచ్చిన గౌరవమన్నారు.
మనిషిని మనిషిగా గౌరవించే చోటే నిజమైన మానవత్వం ఉంటుందని పారిశుద్ధ్య కార్మికుల పట్ల చూపిన ఈ ఆప్యాయత, సమాజంలో సమానత్వం, సేవాభావం, పరస్పర గౌరవం మరింత పెరగాలనే సందేశాన్ని అందించింది.సేవ చేసే చేతులకు సెల్యూట్… శ్రమించే మనుషులకు పాదాభివందనం! ఇదే నిజమైన మానవత్వం అని పలువురికి ఆదర్శంగా నిలిచిందని మున్సిపల్ కౌన్సిలర్ ను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వినోద్ కుమార్, పరిశుద్ధ కార్మికులు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు పాల్గొన్నారు.




