Mulugu: బొడ్రాయి అభివృద్ధి పనులు చేపట్టాలని కలెక్టర్‌కు వినతి

Mulugu: ములుగు పట్టణంలో బొడ్రాయి మరమ్మతులు, అభివృద్ధి పనులను దసరాలోపు పూర్తి చేయాలని కోరుతూ కౌన్సిలర్ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

PONNALA SWAMY, MULUGU
Published on: 30 Sept 2026 7:13 PM IST
Mulugu
X

Mulugu: బొడ్రాయి అభివృద్ధి పనులు చేపట్టాలని కలెక్టర్‌కు వినతి

ములుగు: ములుగు మున్సిపల్ 4వ వార్డు కౌన్సిలర్ గుంటోజు పావనినిరంజన్ గారి ఆధ్వర్యంలో ములుగు పట్టణంలోని బొడ్రాయి మరమ్మతులు, అభివృద్ధి పనులను త్వరితగతిన చేపట్టాలని కోరుతూ గౌరవ కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేశారు.

రానున్న దసరా పండుగను దృష్టిలో పెట్టుకొని పనులను త్వరగా మంజూరు చేసి, పండుగకు ముందే మరమ్మతులు పూర్తి చేయాలని కోరారు. ఇందుకు సంబంధించిన పనుల ఎస్టిమేషన్ కాపీని కూడా కలెక్టర్ గారికి సమర్పించారు.

మరమ్మతుల్లో భాగంగా గ్రావెల్స్, గ్రానైట్, బొడ్రాయి చుట్టూ కాంపౌండ్ గ్రిల్స్ ఏర్పాటు తదితర అభివృద్ధి పనులను ప్రతిపాదించారు.

ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా మాజీ జడ్పీ కో-ఆప్షన్ సభ్యులు రియాజ్ మీర్జా, కాంగ్రెస్ నాయకులు గుంటోజు నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.

దసరా పండుగకు ముందే బొడ్రాయి అభివృద్ధి పనులు పూర్తయి, ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

PONNALA SWAMY, MULUGU

PONNALA SWAMY, MULUGU