Mulugu: రామప్ప ఆలయాన్ని సందర్శించిన ప్రముఖ సినీనటుడు తనికెళ్ల భరణి
Mulugu: ములుగు జిల్లా రామప్ప ఆలయాన్ని సందర్శించిన నటుడు తనికెళ్ల భరణి. శిల్పకళా వైభవాన్ని కొనియాడిన ఆయన రామప్ప చెరువులో బోటింగ్.
Mulugu: రామప్ప ఆలయాన్ని సందర్శించిన ప్రముఖ సినీనటుడు తనికెళ్ల భరణి
ములుగు జిల్లా: మండలం లోని పాలంపేట గ్రామంలోని రామప్ప దేవాలయాన్ని మంగళవారం ప్రముఖ సిని నటుడు తనికెళ్ళ భరణీ దర్శించుకున్నారు.
ఆలయ అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్ లు వారికి స్వాగతం ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేసి, స్వామి వారి శేషావస్ర్తాలను బహుకరించారు.
వారికి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ లు ఆలయ చరిత్ర, శిల్పకళ వైభవం, కాకతీయుల చరిత్ర గురించి వివరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు రామప్పను సందర్శించడం రెండోసారి అని రామప్ప శిల్పకళ అద్భుతం అని, ఎన్ని సార్లు చూసిన తనివి తీరనది రామప్ప శిల్ప కళ అని అన్నారు.
తాను రామప్ప శిల్పకళపై రాసిన ఆటగదరా శివ ఆటగదరా రామప్ప శిల్పాల అంగవైకల్యాలు పాటను గుర్తు చేసుకున్నారు. అనంతరం రామప్ప చెరువును సందర్శించి బోటింగ్ చేశారు. వారి వెంట ఈవో ఇమ్మడి భాస్కర్, టూరిస్ట్ పోలీసులు, శ్రీనివాస్, శ్రీకాంత్, బద్రు, అరుణ్, పురావస్తు, దేవాదాయ, టూరిజం శాఖల సిబ్బంది తదితరులు ఉన్నారు.




