Mulugu: ములుగు: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
Mulugu: ములుగు జిల్లా మంగపేట పోక్సో కేసులో నిందితుడు మాతూరి రమేష్‌కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
Mulugu: ములుగు: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
ములుగు జిల్లా: ములుగు జిల్లా మంగపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైమ్ నం.146/2020, సెక్షన్ 376(n), 366, 506 IPC మరియు POCSO Act సెక్షన్ 5 r/w 6 కింద నమోదైన కేసులో నిందితుడు మాతూరి రమేష్‌ను దోషిగా నిర్ధారిస్తూ ములుగు ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పు వెలువరించింది.ఈ కేసులో ములుగు ప్రత్యేక పోక్సో కోర్టు-కమ్ ప్రిన్సిపల్ జిల్లా & సెషన్స్ జడ్జి శ్రీమతి S.V.P. సూర్య చంద్రకళ తీర్పు వెలువరించారు
ఈ కేసులో నిందితుడికి *20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష*తో పాటు రూ.8,500 జరిమానా, బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
ఈ కేసులో దర్యాప్తు అధికారులు గా అప్పటి ASP ఎటూరునాగారం శరత్ చంద్ర పవార్ ఐపీస్ , గౌస్ ఆలం ఐపీస్ వ్యవహరించగా ఎస్సై శ్రీనివాస్ ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు.
ఈ కేసును చేదించడంలో ప్రస్తుత అధికారులైన ASP మానన్ భట్ IPS, CI సూర్యప్రకాశ్, ఎస్ ఐ టీ వి ఆర్ సూరి కోర్టు మానిటరింగ్ అధికారి DSP కిషోర్, కోర్టు లైజనింగ్ అధికారి ASI కుమారస్వామి, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి. రామ్‌సింగ్, CDOలు K. మౌనిక WPC-187, J. మంగీలాల్ PC-164 తదితరులు కీలకంగా పనిచేశారు.
కేసు దర్యాప్తు, కోర్టు సమన్వయం మరియు ప్రాసిక్యూషన్‌లో సమిష్టిగా కృషి చేసిన ప్రతి ఒక్కరినీ ములుగు జిల్లా ఎస్పీ శ్రీ కేకన్ సుధీర్ రామనాథ్ ఐపీస్ అభినందించారు. కేసుల్లో నాణ్యమైన దర్యాప్తుతో పాటు బాధితులకు న్యాయం జరిగేలా పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ సూచించారు.




