Mulugu: వయోవృద్ధుల దినోత్సవ పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి సీతక్క
Mulugu: ములుగులో వయోవృద్ధుల దినోత్సవ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి సీతక్క. అక్టోబర్ 1న నూతన కలెక్టరేట్‌లో వేడుకలు విజయవంతం చేయాలని పిలుపు.
Mulugu: వయోవృద్ధుల దినోత్సవ పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి సీతక్క
ములుగు: అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్‌ను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క గురువారం క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి అనసూయ సీతక్క మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థులతో వృద్ధుల ముఖాముఖి కార్యక్రమాలు, నాటి ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆరోగ్య పరీక్షలు, కంటి పరీక్షలు, సైబర్ నేరాలపై అవగాహన సదస్సులు, యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
అక్టోబర్ 1న సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించే జిల్లా స్థాయి వయోవృద్ధుల దినోత్సవానికి వృద్ధులతోపాటు వారిని సంరక్షించే కుటుంబ సభ్యులు సైతం హాజరు కావాలని కోరారు. వృద్ధుల అవసరాలు, సమస్యలను గుర్తించి వారి సంక్షేమానికి తగిన చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డి డబ్ల్యు ఓ ప్రేమలత, వయోవృద్ధుల సంఘం సభ్యులు పాల్గొన్నారు.




