Mulugu: ములుగు కేంద్రీయ విద్యాలయంలో కేటగిరీ మార్పుపై ఫిర్యాదు!

Mulugu: ములుగు కేంద్రీయ విద్యాలయంలో ఎస్సీ విద్యార్థిని ఎస్టీ కేటగిరీలో నమోదు చేసిన వైనం.. కలెక్టర్‌ను కలిసి న్యాయం కోరిన పసులాది ముఖేష్.

PONNALA SWAMY, MULUGU
Published on: 18 Sept 2026 12:45 PM IST
Mulugu
X

Mulugu: ములుగు కేంద్రీయ విద్యాలయంలో కేటగిరీ మార్పుపై ఫిర్యాదు!

Mulugu: 2026–27 విద్యా సంవత్సరానికి బాలవాటిక–2 ప్రవేశ ప్రక్రియలో SC కేటగిరీకి చెందిన విద్యార్థిని ST కేటగిరీలో నమోదు చేసి డ్రాలో పరిగణించిన అంశంపై జిల్లా కలెక్టర్‌ను కలిసి న్యాయం కోరేందుకు పసులాది ముఖేష్ వినతిపత్రం సమర్పించారు.

ముఖేష్ తన కుమారుడు పసులాది విహాన్ స్వేరో బాలవాటిక–2 ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్నారని, ఆయన దరఖాస్తు సంఖ్య BV287 అని తెలిపారు. విద్యార్థి వాస్తవ కేటగిరీ SC అయినప్పటికీ, ప్రవేశ రికార్డులో CATV: STగా నమోదు చేసినట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు.

అదేవిధంగా, ST కేటగిరీలో నిర్వహించిన డ్రాలో విద్యార్థికి 12వ డ్రా నంబర్ వచ్చినట్లు సంబంధిత రికార్డులో కనిపిస్తోందని తెలిపారు. ఈ కేటగిరీ నమోదు కారణంగా విద్యార్థి సరైన SC కేటగిరీలో పరిగణించబడలేదనే సందేహం ఏర్పడిందని, పూర్తి స్థాయి విచారణ జరిపించాలని కోరారు.

ఈ అంశంపై కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు అందజేయగా, సంబంధిత విషయాన్ని పరిశీలించాలని చేతిరాత ద్వారా సూచించినట్లు ముఖేష్ తెలిపారు.

విద్యార్థి అసలు దరఖాస్తు వివరాలు, కేటగిరీ నమోదు రికార్డులు, డ్రా ప్రక్రియను సమగ్రంగా పరిశీలించి, తప్పిదం జరిగినట్లు నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం సరిదిద్ది విద్యార్థికి న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను కోరనున్నట్లు పసులాది ముఖేష్ తెలిపారు.

డ్రా పూర్తయిన నేపథ్యంలో ఈ విషయాన్ని అత్యవసరంగా పరిగణించి, విద్యార్థి వాస్తవ SC కేటగిరీ ఆధారంగా ప్రవేశ అర్హతను పునఃపరిశీలించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

విద్యార్థుల హక్కులు, సామాజిక న్యాయం పరిరక్షణ కోసం సంబంధిత అధికారులను కలిసి న్యాయం సాధించే వరకు కృషి చేస్తానని పసులాది ముఖేష్ పేర్కొన్నారు.

PONNALA SWAMY, MULUGU

PONNALA SWAMY, MULUGU