Mulugu: పట్టభద్రులంతా ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలి కలెక్టర్!

Mulugu: వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుపై ములుగు జిల్లా కలెక్టర్ హేమంత్ సహదేవరావు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష.

PONNALA SWAMY, MULUGU
Published on: 29 Sept 2026 2:30 PM IST
Mulugu
X

Mulugu: పట్టభద్రులంతా ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలి కలెక్టర్!

Mulugu: ములుగు జిల్లా కలెక్టరేట్ లో వరంగల్- ఖమ్మం- నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా లో నమోదుపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశం. జిల్లాలో పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావు అన్నారు.

మంగళవారం ములుగు జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వరంగల్- ఖమ్మం- నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా లో పట్టభద్రులైన ఓటర్లు ఓటరుగా నమోదు చేసుకోవడంపై గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం వెలువరించిన నియమ నిబంధనలు, దరఖాస్తు చేసే విధానం, గడువు, తదితర వివరాలను జిల్లా కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు అర్హులైన గ్రాడ్యుయేట్లు ఓటరు జాబితాలో నమోదు చేసుకోవడంపై అవగాహన కల్పించాలన్నారు. కొత్తగా ఓటరు గా నమోదు కోసం గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారు ఫారం 18 ద్వారా అన్ని వివరాలను నింపి గెజిటెడ్ అధికారి లేదా డిసిగ్నేటెడ్ అధికారి ద్వారా సంతకం చేసిన ధ్రువపత్రాన్ని సంబంధిత అధికారులకు సమర్పించాలన్నారు. 01/11/2023కంటే ముందు పట్టభద్రులైన వారు, ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలో స్థానిక నివాసులై ఉన్నవారు ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు.

అర్హులైన పట్టభద్రులు తమ సంబంధిత మండల తహసీల్దార్లు, సహాయ ఓటరు నమోదు అధికారులు (AEROs) మరియు నియమిత అధికారులను సంప్రదించి దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు. దరఖాస్తుతో పాటు విద్యార్హతకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు, అవసరమైన ఇతర పత్రాలను జతచేయాలని సూచించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి అధికారిక వెబ్‌సైట్ [https://ceotelangana.nic.in/](https://ceotelangana.nic.in/) ను సందర్శించవచ్చని తెలిపారు.

పట్టభద్రుల ఓటరు జాబితాల నూతన తయారీ ప్రక్రియలో భాగంగా, ఇప్పటికే ఓటరు జాబితాలో పేర్లు ఉన్నవారు సైతం నిర్దేశిత విధానం ప్రకారం తిరిగి దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పాత ఓటరు జాబితాలో పేరు ఉండటం ఒక్కటే ప్రస్తుత ప్రక్రియలో నమోదుకు సరిపోదని, అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు నిర్ణీత విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

రాజకీయ పార్టీల ప్రతినిధులు పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియపై విస్తృతంగా అవగాహన కల్పించాలని, అర్హులైన పట్టభద్రులు నిర్ణీత గడువులోగా ఫారం-18 దరఖాస్తులు సమర్పించేలా సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి కోరారు. ఓటరు జాబితాల తయారీ ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా జరిగేలా సంబంధిత అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ సమావేశంలో డిస్ట్రిక్ట్ రెవిన్యూ ఆఫీసర్ వి. రవి కుమార్, ఎలక్షన్ సెల్ డిటిలు నితీష్, గణపతి, సతీష్ వివిధ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

PONNALA SWAMY, MULUGU

PONNALA SWAMY, MULUGU