Mulugu: కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు: బడే నాగజ్యోతి భరోసా
Mulugu: ములుగు జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని ఇంచార్జ్ బడే నాగజ్యోతి పిలుపునిచ్చారు.
Mulugu: కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు: బడే నాగజ్యోతి భరోసా
ములుగు జిల్లా : ములుగు జిల్లా కేంద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ములుగు మండల పార్టీ తాజా మాజీ అధ్యక్షులు సనికొమ్ము రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశానికి BRS పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి బడే నాగజ్యోతి గారు ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
సమావేశంలో పార్టీ బలోపేతం, కార్యకర్తల సమస్యలు, ప్రజా సమస్యలు, గ్రామస్థాయి పార్టీ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.
కార్యకర్తలకు BRS పార్టీ ఎల్లవేళల అండగా ఉంటుందిపార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా పార్టీ నాయకత్వం అండగా నిలుస్తుందని బడే నాగజ్యోతి తెలిపారు.
కార్యకర్తలు ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా కార్యకర్తలు అధైర్యపడకుండా ప్రజల్లో ఉండాలని, పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే ప్రతి కార్యకర్తకు భవిష్యత్తులో తగిన గుర్తింపు లభించేలా నాయకత్వం కృషి చేస్తుందని అన్నారు ప్రజా సమస్యలే ప్రధాన అజెండాగా పనిచేయాలి గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం ప్రజల తరఫున ప్రశ్నిస్తూ నిరంతరం పోరాడాలని కార్యకర్తలకు సూచించారు.
గత BRS పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలి గత BRS ప్రభుత్వ హయాంలో ములుగు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు, ఆయా పనుల ద్వారా ప్రజలకు కలిగిన ప్రయోజనాలను గ్రామస్థాయిలో చర్చించాలనిసూచించారు.
ప్రస్తుత ప్రభుత్వ హామీలపై ప్రజలకు వాస్తవ సమాచారం అందించాలికాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ప్రస్తుతం వాటి అమలు పరిస్థితి, ములుగు నియోజకవర్గానికి సంబంధించిన పెండింగ్ సమస్యలు వంటి అంశాలపై వాస్తవ సమాచారాన్ని సేకరించి ప్రజలకు వివరించాలని అన్నారు మంత్రి సీతక్క గెలిచి 3 సంవత్సరాలు పూర్తి కావస్తున్న ములుగు నియోజకవర్గంలో ఏం అభివృద్ధి జరిగిందో ప్రజలకి చెప్పాలి పంచాయతీ రాజ్ మంత్రిగా ఉండి మీరు ములుగు నియోజకవర్గ పరిధిలో జరిగిన ప్రధాన అభివృద్ధి ఏంటో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రజలకి కరెంట్ కూడా ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు 22 A పేరుతో ప్రజల భూములు లాక్కోవాలని ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్ర పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలతో నిరంతరం మమేకమై, వారి సమస్యలను తెలుసుకుని, వారికి అందుబాటులో ఉండాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని అన్నారు.
కార్యకర్తల ఐక్యతే పార్టీ బలం గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు ప్రతి కార్యకర్త పరస్పర సమన్వయంతో పనిచేయాలని, వ్యక్తిగత విభేదాలకు తావులేకుండా పార్టీ ప్రయోజనాల కోసం ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
రాబోయే పార్టీ కమిటీల్లో యువకులకు పెద్దపేట వేస్తాం అని ఈ సందర్భంగా తెలిపారు అలాగే యువకులు కూడా ఎంతో ఉత్సాహంతో పనిచేయాలి అని దిశ నిర్దేశం చేశారు ములుగు గడ్డపై గులాబీ జెండా ఎగరడమే లక్షం గా కార్యకర్తలంతా సమష్టిగా, ఐక్యంగా పనిచేస్తూ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని బడే నాగజ్యోతి అన్నారు ములుగు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా బడే నాగజ్యోతి గారు మాట్లాడుతూ, “కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దు.. మీకు పార్టీ అండగా ఉంటుంది. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ, ప్రజల మధ్యనే ఉండాలి. పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు నాయకత్వం అండగా నిలుస్తుంది” అని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ములుగు మండల పార్టీ అధ్యక్షులు సనికొమ్ము రమేష్ రెడ్డి ములుగు మున్సిపాలిటీ కౌన్సిలర్ల కోగిల లక్ష్మీ బైకని సాగర్ మాజీ ఎంపీపీ మురళి సర్పంచులు వీరబోయిన రాజేందర్ తప్పెట్ల రాజేందర్ దాసరి సరిత రమేష్ మాజీ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ కోరం సంతోష్ కుడుముల లక్ష్మీనారాయణ పార్టీ నాయకులు వేములపల్లి బిక్షపతి ఎంపీటీసీ పోరం మాజీ అధ్యక్షులు పోరికా విజయరాంనాయక్ కాకి పురుషోత్తం అకుతోట చంద్రమౌళి ఉయ్యాల భద్రయ్య వంకుడోతూ రాందాస్ ముంజల బిక్షపతి గరిగ రఘు ఈశ్వరి రసమల్ల సురేందర్ పైడిమల్ల భాస్కర్ అనుముల సురేష్ ములుగు మండల పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.




