Mulugu: రెడ్ క్రాస్ సొసైటీ ములుగు జిల్లా శాఖ ఎన్నికలకు 17 నామినేషన్లు!
Mulugu: ములుగు జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిర్వహణ కమిటీ ఎన్నికలకు అందిన 17 నామినేషన్లు.. వివరాలు వెల్లడించిన ఎన్నికల అధికారి డాక్టర్ ధర్మ నాయక్.
Mulugu: రెడ్ క్రాస్ సొసైటీ ములుగు జిల్లా శాఖ ఎన్నికలకు 17 నామినేషన్లు!
Mulugu: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సంక్షేమ భవనంలోని సమావేశ మందిరంలో గురువారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు భారత రెడ్‌క్రాస్ సొసైటీ ములుగు జిల్లా శాఖ నిర్వహణ కమిటీ నామినేషన్లు స్వీకరించినట్లు తెలిపారు. గడువు ముగిసే సమయానికి మొత్తం 17 నామినేషన్లు అందినట్లు వెల్లడించారు.
ఈ నెల 25న ఉదయం 10 గంటల నుంచి నామినేషన్లను పరిశీలించి, చెల్లుబాటైన నామినేషన్ల జాబితాను ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ నెల 26న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పిస్తామని తెలిపారు.
పోటీ అనివార్యమైతే అక్టోబర్ 4న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి, లెక్కింపు పూర్తయిన అనంతరం ఫలితాలను ప్రకటిస్తామని ఎన్నికల అధికారి ధర్మ నాయక్ ఆ ప్రకటనలో వెల్లడించారు.




