Tekulagudem: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంపై కాంగ్రెస్ నేతల కీలక సమావేశం!

Tekulagudem: హనుమకొండలో ఉమ్మడి నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి, ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 27 Oct 2026 10:54 AM IST
Tekulagudem
X

Tekulagudem: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంపై కాంగ్రెస్ నేతల కీలక సమావేశం!

Tekulagudem: ఈరోజు హనుమకొండ టేకులగూడెంలోని గెస్ట్ హౌస్‌లో తెలంగాణ రాష్ట్ర ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ జంగా రాఘవరెడ్డి గారి నివాసంలో ఉమ్మడి నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి గారు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పలు కీలక అంశాలపై వారు చర్చించారు.పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఎన్నికల ప్రచార నిర్వహణ,పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ,క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు,కార్యకర్తల సమన్వయం తదితర అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు.

అలాగే పట్టభద్రుల సమస్యలు,వారి ఆకాంక్షలు,విద్యావంతుల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చిస్తూ, పట్టభద్రుల సమస్యలను సంబంధిత వేదికలపై ప్రస్తావించడం,వారి అవసరాలకు అనుగుణంగా కార్యక్రమాలు చేపట్టడం వంటి అంశాలపై మాట్లాడుకున్నారు.

ఈ భేటీలో రానున్న ఎన్నికలకు సంబంధించి పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం,నాయకులు మరియు కార్యకర్తల భాగస్వామ్యం,పట్టభద్రులతో నిరంతర సంబంధాలు కొనసాగించడం వంటి అంశాల ప్రాధాన్యతను చర్చించారు.

ఈ మర్యాదపూర్వక సమావేశం సందర్భంగా పరస్పర ఆత్మీయతను పంచుకుంటూ,పట్టభద్రుల సమస్యలు,పార్టీ కార్యక్రమాలు మరియు రానున్న ఎన్నికలకు సంబంధించిన అంశాలపై సానుకూలంగా అభిప్రాయాలను వెల్లడించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్