Warangal: ఉద్యమకారుడు కేదారి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యేలు!
Warangal: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలంగాణ ఉద్యమకారుడు కేదారి కుటుంబాన్ని పరామర్శించి చెక్కు అందజేశారు.
Warangal: ఉద్యమకారుడు కేదారి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యేలు!
Warangal: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి , వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కేదారి కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్లి చెక్కును అందజేసి, కుటుంబాన్ని పరామర్శించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ఆనాటి ఉద్యమకారులకు ఆపన్నహస్తం అందిస్తూ అండగా నిలిచిన లింగాల కేదారి సేవలను తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం గుర్తించి, ఆయన కుటుంబానికి ఆర్థిక చేయూత అందించిందని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ సమయంలో పోరాడిన ఉద్యమకారులను ప్రజా ప్రభుత్వం గౌరవిస్తుందని, రానున్న రోజుల్లోనూ ఉద్యమంలో పాల్గొని పోరాటం చేసిన ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తుందని అన్నారు.
కేదారి కుటుంబం ప్రస్తుత కష్టకాలంలో తాను వ్యక్తిగతంగా కూడా అండగా ఉంటానని, తన వంతుగా కుటుంబ సభ్యులను అన్ని విధాలుగా ఆదుకుంటానని ఎమ్మెల్యే నాయిని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి, ఆపదలో ఉన్న కుటుంబాలను ఆదుకోవడానికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.




