Hanumakonda: పరకాలలో ఓటర్ల జాబితా ప్రక్షాళనలో రాష్ట్రంలోనే మొదటి స్థానం!
Hanumakonda: హనుమకొండలోని క్యాంపు కార్యాలయంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
Hanumakonda: పరకాలలో ఓటర్ల జాబితా ప్రక్షాళనలో రాష్ట్రంలోనే మొదటి స్థానం!
Hanumakonda: హనుమకొండ భవన్ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు పరకాల నియోజకవర్గ ముఖ్య నాయకులతో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ ఐ ఆర్ ఫేస్2 ప్రక్రియలో పరకాల నియోజకవర్గంలో ఓటర్ జాబితా ప్రక్షాళన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్నామని అన్నారు. ఇందుకు సహకరించిన బిఎల్ఎ లు, బిఎల్ఓ లు, క్లస్టర్ ఇంచార్జిలు, మా మండల, పట్టణ, డివిజన్ అధ్యక్షులకు, కౌన్సిలర్లు, సర్పంచులు, గ్రామ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఎస్ఐఆర్ ఫేజ్ 1 ప్రక్రియలో రాష్ట్రంలో 2 వ స్థానం సాధించామన్నారు.
మీ కృషివల్లే పరకాల నియోజకవర్గంలో 41 వేలు 945 నోటీసులను పరిష్కారం చేసి, అర్హులను కాపాడగలిగామన్నారు. ప్రతి ఓటును కాపాడుకోవడం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమేనని, ఓటు హక్కు లేని వారిని గుర్తించి కొత్త ఓటర్గా నమోదు చేసేలా ప్రోత్సహించాలన్నారు.
వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికలకు గ్రాడ్యుయేట్స్ ఓటర్ల నమోదు కార్యక్రమం చేపట్టుటపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు.2024 ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం లో 14,822 ఓట్లు ఉన్నాయన్నారు. పరకాల టౌన్ మరియు గీసుగోండ, సంగం మండల కేంద్రాలలో గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కేంద్రాన్ని ప్రారంభించాలని తెలిపారు. అలాగే గ్రామ, వార్డు స్థాయి పార్టీ పూర్తి కమిటీల నియామకం , ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఎన్నికల తీరుపై చర్చించారు.




