Parkal: భవానీ కుంకుమేశ్వర ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే!
Parkal: పరకాలలోని శ్రీ భవానీ కుంకుమేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పనులకు రూ. 5 కోట్ల వ్యయంతో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి భూమి పూజ చేశారు.
Parkal: భవానీ కుంకుమేశ్వర ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే!
Parkal: పరకాలలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ భవాని కుంకుమేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పనులకు భూమి పూజ ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి హాజరై భూమి పూజ చేశారు. రూ. 5 కోట్ల వ్యయంతో ఆలయానికి మూడు గోపురాలు నిర్మించడంతో పాటు పలు అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు తెలిపారు.
ఎల్ నినో ప్రభావం లేకుండా ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మెల్యే ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




