Hanumakonda: పరకాలలో బతుకమ్మ ఏర్పాట్లు, స్కూల్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే రేవూరి!

Hanumakonda: పరకాల నియోజకవర్గంలో బతుకమ్మ వేడుకల ఏర్పాట్లు మరియు ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పరిశీలించారు.

M PRABHAKAR, PARAKAL
Published on: 14 Oct 2026 1:15 PM IST
Hanumakonda
X

Hanumakonda: పరకాలలో బతుకమ్మ ఏర్పాట్లు, స్కూల్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే రేవూరి!

Hanumakonda: పరకాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి బుధవారం పలు అభివృద్ధి పనులు, ఏర్పాట్లను పరిశీలించారు. పరకాల పశువుల సంతలో జరగనున్న బతుకమ్మ వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు. ఈసారి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. వేడుకలకు వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తాగునీరు, కరెంట్, శానిటేషన్, భద్రత విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పండుగను విజయవంతం చేయాలని సూచించారు.

అనంతరం పరకాలలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని వసతులు కల్పించాలని, పనులను త్వరితగతిన నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL