Parkal: ఏరియా ఆసుపత్రిని పరిశీలించిన ఎమ్మెల్యే రేవూరి, కలెక్టర్!

Parkal: ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవలు, సదుపాయాలు, నిర్వహణ తీరును ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ కలిసి పరిశీలించి సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేశారు.

M PRABHAKAR, PARAKAL
Published on: 12 Nov 2026 3:17 PM IST
Parkal
X

Parkal: ఏరియా ఆసుపత్రిని పరిశీలించిన ఎమ్మెల్యే రేవూరి, కలెక్టర్!

Parkal: పరకాల స్థానిక ఏరియా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సదుపాయాలు, ఆసుపత్రి నిర్వహణ తీరును ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ కలిసి పరిశీలించారు.

ఆసుపత్రిలోని వివిధ విభాగాలను సందర్శించి, వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలు తెలుసుకున్నారు.

రోగులను పలకరించి వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. వార్డుల్లో పరిశుభ్రత, మందుల లభ్యత, సిబ్బంది హాజరు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు.

రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, వైద్య సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని వైద్య సిబ్బందికి సూచించారు. ఆసుపత్రిలో పరిశుభ్రత, మందుల లభ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెరిగేలా పనిచేయాలని స్పష్టం చేశారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL