Jangaon: జనగామ జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా సద్ధుల బతుకమ్మ వేడుకలు!
Jangaon: జనగామ జిల్లా వ్యాప్తంగా సద్ధుల బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. జనగామ బతుకమ్మ కుంటలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సతీసమేతంగా పాల్గొని మహిళలతో కలిసి సందడి చేశారు.
Jangaon: జనగామ జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా సద్ధుల బతుకమ్మ వేడుకలు!
Jangaon: జనగామ జిల్లా వ్యాప్తంగా సద్ధుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి, మహిళలు తీరొక్క రంగు పూలతో బతుకమ్మలను పేర్చి ఆట పాటలతో బతుకమ్మలను నిమజ్జనం చేశారు, ఇందులో భాగంగా జనగామ జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంటలో సద్ధుల బతుకమ్మ వేడుకలను ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సతీ సమేతంగా హాజరై మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా Shoulders రెడ్డిసతీమణి పల్లా నీలిమ, మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి, వైస్ చైర్మెన్ భూష పర్వతాలు పలువురు ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, జనగామ నియోజకవర్గ ప్రజలకు సద్ధుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు, పూలను పూజించే సంస్కృతి మనదని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో సైతం మహిళలు బతుకమ్మ ఆటపాటలతో నిరసనలు తెలిపి కీలక పాత్ర పోషించారన్నారు, దసరా పండగ చెడు పై మంచి విజయం సాధించిన రోజుగా అంగరంగ వైభవంగా జరుపుకుంటామని అన్నారు.




