Jangaon: జనగామలో ఘనంగా జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు!
Jangaon: జనగామ జిల్లా కేంద్రంలో ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు. బీఆర్ఎస్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు.
Jangaon: జనగామలో ఘనంగా జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు!
Jangaon: జనగామ జిల్లా కేంద్రంలో తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలను బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు అత్యంత వైభవంగా నిర్వహించాయి. స్థానిక బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేకంగా పాల్గొన్నారు.
జెండా ఆవిష్కరణ అనంతరం నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ పోరాట పటిమను, తెలంగాణ అమరవీరుల త్యాగాలను ఈ సందర్భంగా వారు స్మరించుకున్నారు. ఈ వేడుకల్లో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు మరియు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.




