Warangal: వడ్డేపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.10 లక్షలు!
Warangal: వడ్డేపల్లి టీఎన్జీవోస్ కాలనీలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ఎస్డీఎఫ్ నిధుల నుంచి రూ.10 లక్షలు కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు.
Warangal: వడ్డేపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.10 లక్షలు!
Warangal: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 58వ డివిజన్ టీఎన్జీవోస్ కాలనీ, వడ్డేపల్లిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన దక్షిణ ప్రాకార సాలాహార ప్రతిష్ఠ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలికి మర్యాదపూర్వకంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే గారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా భక్తులకు మరింత ఆహ్లాదకరంగా, ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా దేవాలయాన్ని తీర్చిదిద్దుకోవడం సంతోషకరమన్నారు. ఆలయ కమిటీ సభ్యులు సూచించిన విధంగా ఆలయ ద్వారం వద్ద, వెనుక భాగంలో శంఖు, చక్రాల ప్రతిమలతో సుందరంగా తీర్చిదిద్దితే ఆలయానికి మరింత ప్రత్యేకత చేకూరుతుందని పేర్కొన్నారు.
ఆలయ అభివృద్ధికి అవసరమైన పనుల కోసం ఎస్డీఎఫ్ నిధుల నుంచి రూ.10 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి నిధుల మంజూరుకు అవసరమైన ఆమోద ప్రక్రియను వెంటనే పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు.
దేవాలయ అభివృద్ధికి ఆలయ కమిటీ చేస్తున్న కృషిని అభినందిస్తూ, భవిష్యత్తులోనూ ఆలయ అభివృద్ధికి తన సహకారం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులకు, కాలనీ వాసులకు మరోసారి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నాగరాజు, స్థానిక డివిజన్ అధ్యక్షులు సుధాకర్, నాయకులు నేహాల్, మందల సమ్మయ్య, మేరి, టీఎన్జీవోస్ ప్రతినిధులు ఆకుల రాజేందర్, కారం రవీందర్ రెడ్డి, ఏ. జగన్మోహన్, బి. సోమయ్య, కోలా రాజేష్, పి. వేణుగోపాల్, రాజేష్, శ్యామ్ తదితరులతో కలిసి పాల్గొన్నారు.




