Hanumakonda: వేయి స్తంభాల గుడిలో శరన్నవరాత్రి ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ!

Hanumakonda: హనుమకొండలోని చారిత్రక వేయి స్తంభాల దేవాలయంలో ఈ నెల 11 నుంచి 20 వరకు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 7 Oct 2026 11:39 AM IST
Hanumakonda
X

Hanumakonda: వేయి స్తంభాల గుడిలో శరన్నవరాత్రి ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ!

Hanumakonda: వేయి స్తంభాల దేవాలయంలో ఈ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీ రుద్రేశ్వర దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల పోస్టర్‌ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి ఆవిష్కరించారు. బుధవారం బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆలయ ఈఓ, ఉత్సవ నిర్వాహకులతో కలిసి పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ.. చారిత్రక వేయి స్తంభాల దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ నాయకులు కోన శ్రీకర్,పల్లం రమేష్,తౌటిరెడ్డి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్