Hanamkonda: గ్రాడ్యుయేట్లతో మమేకమైన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, సర్వోత్తం రెడ్డి!
Hanamkonda: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి సర్వోత్తం రెడ్డి హనుమకొండలో మార్నింగ్ వాకర్స్‌ను కలిసి మద్దతు కోరారు.
Hanamkonda: గ్రాడ్యుయేట్లతో మమేకమైన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, సర్వోత్తం రెడ్డి!
Hanamkonda: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి గారితో కలిసి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు శనివారం హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం, జేఎన్ఎస్ మైదానం, పబ్లిక్ గార్డెన్లలో వాకర్స్‌తో ఆత్మీయ పరిచయ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉదయం వాకింగ్‌కు వచ్చిన వారిని కలుసుకుంటూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వాకర్స్‌తో కలివిడిగా మాట్లాడుతూ వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు.
అనంతరం గత మూడేళ్లుగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ల సమస్యలను శాసనమండలిలో ప్రస్తావిస్తూ, వారి గొంతుకగా నిలవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి గారికి తమ మద్దతు తెలియజేయాలని ఈ సందర్భంగా కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




