Gudur: గూడూరులో సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ!

Gudur: మహబూబాబాద్ జిల్లా గూడూరులో ఘనంగా సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ. ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే మురళీ నాయక్.

B NARASIMHA, GUDUR
Published on: 16 Oct 2026 12:27 PM IST
Gudur
X

Gudur: గూడూరులో సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ!

Gudur: మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండల కేంద్రంలో బహుజన వీరుడు, విప్లవ వీరుడు సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు (ఎమ్మెల్యే) మురళీ నాయక్ గారు ముఖ్య అతిథిగా హాజరై, సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బహుజనుల హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం పోరాడిన సర్వాయి పాపన్న గౌడ్ జీవితం అందరికీ ఆదర్శప్రాయమని కొనియాడారు. ఆయన త్యాగాలను, పోరాట పటిమను నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గూడూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ సునీత కొమ్మాలు నాయక్, గౌడ సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.

B NARASIMHA, GUDUR

B NARASIMHA, GUDUR