Warangal: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం!

Warangal: వరంగల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు రాంపూర్ వద్ద ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఘన స్వాగతం పలికారు.

Warangal
X

Warangal: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం!

Warangal: వరంగల్ నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖ మంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి రాంపూర్ వద్ద వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు గారు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు పుష్పగుచ్ఛం అందించి,శాలువాతో సత్కరించి సాదరంగా స్వాగతం పలికారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి,రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మెన్ సిరిసిల్ల రాజయ్య,కూడా చైర్మన్ గుండు సుధారాణి,హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి,వరంగల్ డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ ఆయుబ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్