Raghavapuram: రాఘవపురంలో అగ్నిప్రమాద బాధితులకు కడియం భరోసా!

Raghavapuram: స్టేషన్ ఘన్‌పూర్ రాఘవపురంలో అగ్నిప్రమాద బాధితులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరామర్శించారు. తక్షణ ఆర్థిక సాయం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 6 Sept 2026 11:08 AM IST
Raghavapuram
X

Raghavapuram: రాఘవపురంలో అగ్నిప్రమాద బాధితులకు కడియం భరోసా!

Raghavapuram: స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవపురం గ్రామంలో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధమైన ఘటన స్థలాన్ని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు పరిశీలించారు.

​ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో పిల్లల విద్యా సర్టిఫికెట్లు, బట్టలు, నిత్యవసరాలు, నగదు పూర్తిగా కాలిపోయాయని బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే ఎదుట కన్నీటిపర్యంతమయ్యారు. దీంతో స్పందించిన కడియం శ్రీహరి బాధిత కుటుంబాన్ని ఓదార్చి, అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

తక్షణ సహాయంగా ఆర్థిక సాయం అందించడంతో పాటు, ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి 50 సిమెంట్ బస్తాలు వెంటనే ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ద్వారా ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా కల్పించారు.

​అలాగే, గ్రామంలో అసంపూర్తిగా ఉన్న ఎస్సీ (మాల) కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 15 రోజుల్లో నిధులు మంజూరు చేయిస్తానని, 3నెలల్లో నిర్మాణం పూర్తి చేసే విధంగా నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జూలూకుంట్ల శిరీష్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story