Devarakadra: లక్ష్మీపల్లిలో మిషన్ భగీరథ పైప్‌లైన్ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన!

Devarakadra: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం లక్ష్మీపల్లిలో రూ.5 లక్షలతో మిషన్ భగీరథ పైప్‌లైన్‌కు భూమిపూజ, ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు చేసిన ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA
Published on: 16 Oct 2026 3:04 PM IST
Devarakadra
X

Devarakadra: లక్ష్మీపల్లిలో మిషన్ భగీరథ పైప్‌లైన్ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన!

Devarakadra: దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి గ్రామంలో ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు 5 లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న మిషన్ భగీరథ పైప్‌లైన్ నిర్మాణ పనులకు దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ప్రారంభించి, తదనంతరం గ్రామంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొని లబ్ధిదారుల శుభాకాంక్షలు తెలియజేసి, నూతన వస్త్రాలను బహూకరించి, వారి కుటుంబాల్లో సంతోషం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. అదేవిధంగా లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కూడా అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జియంఆర్ మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అంజిల్ రెడ్డి, అరవింద్ కుమార్ రెడ్డి, సర్పంచ్ లక్ష్మి ఆంజనేయులు, గ్రామ పార్టీ అధ్యక్షుడు బోయ రాములు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎ.వెంకటేశ్వర్ రెడ్డి, సోషల్ మీడియా రాజు గౌడ్, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

K. RAGUVEER KUMAR, DEVARAKADRA