Jangaon: మల్లన్న గండి రిజర్వాయర్‌లో గల్లంతైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతదేహం లభ్యం!

Jangaon: జనగామ జిల్లా మల్లన్న గండి రిజర్వాయర్‌లో గల్లంతైన సాఫ్ట్‌‌వేర్ ఉద్యోగి మృతదేహం లభ్యం, రెండు రోజులుగా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.

V Ravikiran, Jangaon
Published on: 6 Oct 2026 8:20 AM IST
Jangaon
X

Jangaon: మల్లన్న గండి రిజర్వాయర్‌లో గల్లంతైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతదేహం లభ్యం!

Jangaon: జనగామ జిల్లా మల్లన్న గండి రిజర్వాయర్ లో విషాదం చోటుచేసుకుంది. గల్లంతైన సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతదేహం ఈరోజు ఉదయం లభ్యమైంది. రెండు రోజులుగా పోలీసులు, ఫైర్ సిబ్బంది చేస్తున్న గాలింపు చర్యలు ఫలించాయి.

జిల్లాలోని మల్లన్న గండి రిజర్వాయర్ లో ఆదివారం ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి గల్లంతయ్యాడు. స్నేహితులతో కలిసి రిజర్వాయర్ కు వచ్చిన సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది గజ ఈతగాళ్లతో ఆదివారం నుండే గాలింపు చర్యలు చేపట్టారు. రిజర్వాయర్ లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గాలింపునకు తీవ్ర ఆటంకం కలిగింది.

అయితే రెండు రోజుల శ్రమ అనంతరం ఈరోజు ఉదయం మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చి పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

V Ravikiran, Jangaon

V Ravikiran, Jangaon