Eturunagaram: కంటైనర్ పాఠశాలను ప్రారంభించిన మంత్రి సీతక్క!
Eturunagaram: ఏటూరునాగారం మండలం మామిడిగూడెంలో సింగరేణి నిధులతో ఏర్పాటు చేసిన కంటైనర్ పాఠశాలను ప్రారంభించిన మంత్రి సీతక్క, కలెక్టర్ బోర్ఖడే హేమంత్.
Eturunagaram: కంటైనర్ పాఠశాలను ప్రారంభించిన మంత్రి సీతక్క!
Eturunagaram: ఏటూరునాగారం మండలం మామిడిగూడెం గ్రామంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ 15 లక్షల సి ఐ ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన కంటైనర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి ప్రారంభించారు.
అనంతరం పాఠశాల విద్యార్థులతో మంత్రి సీతక్క ముఖాముఖిగా మాట్లాడి వారి చదువు, పాఠశాలలో అందుతున్న సౌకర్యాల గురించి తెలుసుకున్నారు.
విద్యార్థులకు ఏకరూప దుస్తులు, షూస్ లను జిల్లా కలెక్టర్‌తో కలిసి మంత్రి సీతక్క పంపిణీ చేసి విద్యార్ధులతో కలిసి అల్పాహారం చేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కళ్యాణి, జిల్లా విద్యాశాఖాధికారి ఎ. సిద్ధార్థరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ రఘు, ఉల్లాస్ సమన్వయకర్త కృష్ణబాబు, మండల విద్యాధికారి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, సంబంధిత శాఖల అధికారులు, ఇతరులు పాల్గొన్నారు.




