Mulugu: అక్కాచెల్లెళ్ల మృతిపై మంత్రి సీతక్క దిగ్భ్రాంతి.. ఫోన్‌లో పరామర్శ
Mulugu: ములుగు మండలం కాశీందేవిపేటలో నీటికుంటలో పడి మృతిచెందిన చిన్నారుల కుటుంబాన్ని మంత్రి సీతక్క ఫోన్‌లో పరామర్శించి అండగా ఉంటామని భరోసానిచ్చారు.
Mulugu: అక్కాచెల్లెళ్ల మృతిపై మంత్రి సీతక్క దిగ్భ్రాంతి.. ఫోన్‌లో పరామర్శ
Mulugu: ములుగు మండలం కాశీందేవిపేటలో నీటికుంటలో పడి మృతి చెందిన అహ్మద్ పాషా కుమార్తెలు సమ్యాన్, ఆసియా కుటుంబాన్ని రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క ఫోన్‌లో పరామర్శించారు.
ఇద్దరు పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులకు ధైర్యం చెబుతూ, కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనంతరం ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ ఆస్పత్రిలో మృతదేహాలకు నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.




