Jangaon: జనగామలో అభివృద్ధి పండుగ.. మంత్రి పొంగులేటి టూర్ షెడ్యూల్
Jangaon: జనగామ జిల్లాలో సెప్టెంబర్ 26న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించనున్నారు. అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేయనున్నారు.
Jangaon: జనగామలో అభివృద్ధి పండుగ.. మంత్రి పొంగులేటి టూర్ షెడ్యూల్
జనగామ జిల్లా: రాష్ట్ర గృహ నిర్మాణం, రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ నెల 26వ తేదీన జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో షెడ్యూల్ వివరాలిలా ఉన్నాయి..
ఈ సందర్భంగా జిల్లాకేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో జనగామ మున్సిపాలిటీకి చెందిన రూ. కోటి 77 లక్షల విలువ గల 16 చెత్త సేకరణ నూతన ఆటోలకు, జేసీబీకి మంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు.
అలాగే మున్సిపాలిటీ పరిధిలో 54 మంది శానిటరీ వర్కర్లు, ఎలక్ట్రీషియన్ లు, డ్రైవర్ లకు నియామకాల పత్రాలు అందజేయడం జరుగుతుంది.
అనంతరం రూ. రెండు కోట్ల విలువ గల మున్సిపల్ డంపింగ్ యార్డ్ షెడ్ అండ్ మెషినరీ, అలాగే రూ. 38 కోట్ల విలువ గల మురుగు నీటి శుద్ధి ప్లాంట్ (ఎస్టీపీ), జిల్లాలోని తరిగొప్పుల మండలంలో రూ. 2.25 కోట్ల విలువ గల తహసీల్దార్ కార్యాలయ నూతన భవన నిర్మాణం, జిల్లాలోని బచ్చన్నపేట మండలంలోని కట్కూర్ ZPHS, MPPS పాఠశాలల్లో రూ.38.75 లక్షల వ్యయంతో భవన మరమ్మతులు, పునరుద్ధరణ పనులు, అలాగే పోచన్నపేట ఎంపీపీఎస్ పాఠశాలలో రూ.24 లక్షలతో, రామచంద్రాపురం ఎంపీపీఎస్ పాఠశాలలో రూ.23 లక్షలతో, జిల్లాకేంద్రంలోని కోర్టు వద్ద గల జెడ్పీ ఉన్నత పాఠశాల (బాలికలు) రూ. 20 లక్షల వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు, అలాగే జిల్లాలోని 12 కేజీబీవీలు, 15 పీఎం శ్రీ పాఠశాలలు, 28 జెడ్పీహెచ్ఎస్ (బాలికలు) లలో రూ. 1,92,31,996 కోట్లతో అవుట్ డోర్ బాస్కెట్ బాల్ కోర్టుల నిర్మాణం, రూ. 19.25 లక్షల విలువ గల జనగామ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్) ఆవరణలో అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణ పనులు, రూ. 7.35 లక్షల విలువ గల జనగామ చంపక్ హిల్స్‌లోని మాతా-శిశు ఆసుపత్రి (ఎంసీహెచ్)లో ఆక్సిజన్ ప్లాంట్‌కు 50 మీటర్ల సీసీ రోడ్డు పనులు, పార్కింగ్ ప్రాంతంలో గ్రావెల్ నింపడం, సెప్టిక్ ట్యాంక్ నుంచి డ్రెయిన్ వరకు పైప్ డ్రెయిన్ (యూజీడీ) ఏర్పాటు, రూ. పది లక్షలతో జనగామ ఐడీఓసీ (కలెక్టరేట్ కార్యాలయం) వద్ద పార్కింగ్ టైల్స్ వేయడం, ఫెన్సింగ్ ఏర్పాటు, రూ. 31 లక్షలతో జనగామ ఐడీఓసీ (కలెక్టరేట్ భవనం)కు ప్రహరీ గోడ నిర్మాణాల పనులకు మంత్రి శిలాఫలకాల ఆవిష్కరణ, శంకుస్థాపనలు చేస్తారు.
అదే విధంగా మున్సిపాలిటీ పరిధిలో గల 99 మంది డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల గృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహణ, అలాగే 500 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేస్తారు. తదనంతరం బహిరంగ సభలో మంత్రి సందేశం అందిస్తారు.




