Warangal: లింగాల కేదారి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే!
Warangal: వరంగల్‌లో విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన లింగాల కేదారి కుటుంబాన్ని మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే నాయిని పరామర్శించారు. ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందజేశారు.
Warangal: లింగాల కేదారి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే!
వరంగల్: ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో భాగంగా అదాలత్ సర్కిల్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన అనంతరం తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారి కోరిక మేరకు పక్కనే ఉన్న లింగాల కేదారి కుటుంబాన్ని పరామర్శించారు.
ఇటీవల విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన లింగాల కేదారి దంపతుల కుటుంబ సభ్యులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు పరామర్శించి వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
ఉద్యమ కాలంలో లింగాల కేదారి అందించిన సేవలను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు మంత్రికి వివరించారు. కుటుంబానికి ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు.స్పందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రభుత్వపరంగా కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు.




