Jangaon: జనగామలో ఘనంగా పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు!

Jangaon: జనగామ జిల్లా కేంద్రంలో రూ. కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేసి, నూతన ఆటోలను ప్రారంభించారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 26 Sept 2026 2:30 PM IST
Jangaon
X

Jangaon: జనగామలో ఘనంగా పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు!

Jangaon: జనగామ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో శనివారం పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర గృహ నిర్మాణం, రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని uప్రారంభించారు. ఈ సందర్భంగా జనగామ మున్సిపాలిటీకి రూ.1.77 కోట్ల విలువైన 16 చెత్త సేకరణ ఆటోలు, జేసీబీని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అలాగే మున్సిపాలిటీలో శానిటరీ వర్కర్లు 30 మంది, డ్రైవర్లు 20 మంది, ఎలక్ట్రిషియన్లు నలుగురు.. మొత్తం 54 మందికి నియామక పత్రాలు అందజేశారు.

అనంతరం మున్సిపల్ డంపింగ్ యార్డు షెడ్, మెషినరీ పనులకు రూ.2 కోట్లు, మురుగునీటి శుద్ధి ప్లాంట్ (ఎస్టీపీ)కు రూ.38 కోట్లు సహా పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. తరిగొప్పుల మండలంలో రూ.2.25 కోట్లతో తహసీల్దార్ కార్యాలయం నూతన భవనం, బచ్చన్నపేట మండలం కట్కూర్ జెడ్పీహెచ్ఎస్, ఎంపీపీఎస్ పాఠశాలల్లో రూ.38.75 లక్షలతో మరమ్మతులు, పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టారు. అదేవిధంగా పోచన్నపేట, రామచంద్రపురం ఎంపీపీఎస్ పాఠశాలలు, జనగామ కోర్టు సమీపంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల (బాలికలు)లో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. జిల్లాలోని *12 కేజీబీవీలు, 15 పీఎం శ్రీ పాఠశాలలు, 28 జెడ్పీహెచ్ఎస్ (బాలికలు)లో అవుట్ డోర్ బాస్కెట్ బాల్ కోర్టుల నిర్మాణ పనులకు కూడా శ్రీకారం చుట్టారు.

జనగామ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆవరణలో అంతర్గత సీసీ రోడ్డు, చంపక్ హిల్స్లోని మాతా-శిశు ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్కు సీసీ రోడ్డు, పార్కింగ్ ప్రాంత అభివృద్ధి, యూజీడీ పైప్లాన్ పనులు చేపట్టనున్నారు. అలాగే జనగామ ఐడీఓసీ వద్ద పార్కింగ్ టైల్స్, ఫెన్సింగ్, ప్రహరీ గోడ నిర్మాణ పనులకు సంబంధించిన శిలాఫలకాలను మంత్రి ఆవిష్కరించి శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో జనగామ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, జిల్లా కలెక్టర్ సందీప్కుమార్ ఝా, డీసీపీ రాజమహేంద్ర నాయక్, మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి, వైస్ చైర్మన్ భూష పర్వతాలు మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON