Jangaon: జనగామలో వైభవంగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమం!

Jangaon: జనగామ జిల్లాలో అంగరంగ వైభవంగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు. ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి.

MD AHMAD PASHA, JANGAON
Published on: 26 Sept 2026 1:18 PM IST
Jangaon
X

Jangaon: జనగామలో వైభవంగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమం!

Jangaon:జనగామ పట్టణంలోని వీవర్స్ కాలనీ 12వ వార్డులో గల ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని అంగరంగవైభవంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి హాజరై, డోర్నాల లావణ్య శ్రీనివాస్, కందగట్ల మమత, చుంచు సుమలత రాజ్ కుమార్, బిర్రు భవాని మల్లేష్, కొండ ధనలక్ష్మి లబ్ధిదారుల ఇళ్లకు గృహ ప్రవేశం చేశారు. అలాగే లబ్ధిదారులకు నూతన వస్త్రాలను మంత్రివర్యులు అందజేశారు.

అదే విధంగా చేనేత కుటుంబాలు మగ్గాలపై నేస్తున్న వస్త్రాలను పరిశీలించిన మంత్రి, వారి కళా నైపుణ్యాన్ని అభినందించారు. సంప్రదాయ చేనేతకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో చేనేత కార్మికుల పాత్ర ఎంతో కీలకమని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో జనగామ పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీపీ రాజ మహేంద్ర నాయక్, జనగామ మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణి, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON