Mahabubabad: మహబూబాబాద్‌లో ఘనంగా బీజేపీ యువమోర్చా రక్తదాన శిబిరం!

Mahabubabad: ప్రధాని మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో BJYM ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.

A.Rajkumar, Mahabubabad
Published on: 30 Sept 2026 2:12 PM IST
Mahabubabad
X

Mahabubabad: మహబూబాబాద్‌లో ఘనంగా బీజేపీ యువమోర్చా రక్తదాన శిబిరం!

Mahabubabad: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితం లో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్‌ లో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ ఆసుపత్రి లో భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యం లో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానం తో సమానమని , అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక ఇబ్బందులు పడే రోగులకు రక్తదాతలు అండగా నిలవాలని , యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని రక్తదానం పై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా సమాజానికి మేలు చేయవచ్చని , రక్తదాన శిబిరాల్లో యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆపదలో ఉన్నవారికి ప్రాణ దాతలుగా నిలవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు , భారతీయ జనతా యువమోర్చా ప్రతినిధులు పాల్గొన్నారు.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad