Garla: మర్రిగూడెం వేట వెంకటేశ్వర స్వామి హుండీ లెక్కింపు
Garla: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మర్రిగూడెం శ్రీ వేట వెంకటేశ్వర స్వామి దేవాలయం వార్షిక హుండీ లెక్కింపులో రూ.4,19,697 ఆదాయం లభించింది.
Garla: మర్రిగూడెం వేట వెంకటేశ్వర స్వామి హుండీ లెక్కింపు
మహబూబాబాద్ జిల్లా: గార్ల మండలం మర్రిగూడెం గ్రామంలో శ్రీ వేట వెంకటేశ్వర స్వామి దేవాలయం హుండీ లెక్కింపు... శ్రీ వేట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 18-10-2025 నుంచి 24-10-2026 వరకు జరిగిన వార్షిక హుండీ లెక్కింపులో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా మొత్తం రూ.4,19,697 (నాలుగు లక్షల పందొమ్మిది వేల ఆరు వందల తొంభై ఏడు రూపాయలు) ఆదాయం వచ్చిందని,
స్వామివారి పట్ల భక్తులు చూపిన విశేష భక్తికి ఈ ఆదాయం నిదర్శనంగా నిలిచింది. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ అజ్మీర బన్సీలాల్, వైస్ చైర్మన్ అర్జున, ఆలయ కమిటీ సభ్యులు నాగరాజు, సుమలత, కార్యనిర్వహణాధికారి, ఇన్స్పెక్టర్, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తల మండలి, అర్చక బృందం భక్తులకు కృతజ్ఞతలు తెలియజేశారు.




