Maripeda: మరిపెడ మున్సిపాలిటీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. హాజరైన ఎమ్మెల్యే

Maripeda: మరిపెడ మున్సిపల్ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే డాక్టర్ రాంచంద్రునాయక్, చైర్‌పర్సన్ ప్రగతి సిబ్బందికి దుస్తులు పంపిణీ చేశారు.

P PRABHAKAR, DORNAKAL
Published on: 16 Oct 2026 10:12 PM IST
Maripeda
X

Maripeda: మరిపెడ మున్సిపాలిటీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. హాజరైన ఎమ్మెల్యే

మరిపెడ: మరిపెడ మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచంద్రునాయక్‌తో కలిసి మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బందికి దుస్తులు పంపిణీ చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుకల్లో మహిళలు, మెప్మా సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరేష్ రెడ్డి, వైస్ చైర్‌పర్సన్ కాలం సునీత రవీందర్ రెడ్డి, కౌన్సిలర్లు, మెప్మా సభ్యులు, మహిళలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

P PRABHAKAR, DORNAKAL

P PRABHAKAR, DORNAKAL