Maripeda: మరిపెడ ఎంపీడీవో కార్యాలయ మైదానంలో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ

Maripeda: మరిపెడ ఎంపీడీవో కార్యాలయ మైదానంలో సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

P PRABHAKAR, DORNAKAL
Published on: 18 Oct 2026 9:11 PM IST
Maripeda
X

Maripeda: మరిపెడ ఎంపీడీవో కార్యాలయ మైదానంలో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ

మరిపెడ: మరిపెడ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ మైదానంలో సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ పాల్గొని మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి మహిళలు వేడుకల్లో పాల్గొన్నారు. సాంప్రదాయ పాటలు, ఆటలతో మహిళలు సందడి చేస్తూ బతుకమ్మ సంబరాల్లో మునిగితేలారు. తెలంగాణ సంస్కృతి, ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలతో మరిపెడలో పండుగ వాతావరణం నెలకొంది.

P PRABHAKAR, DORNAKAL

P PRABHAKAR, DORNAKAL