Mangapet: మంగపేట సీసీ రోడ్డుపై ఇసుక దుమ్ము.. మంత్రి సీతక్క ఆదేశాలతో శుభ్రం!

Mangapet: మంగపేట సీసీ రోడ్డుపై ఇసుక దుమ్ము, చెత్తాచెదారంపై మంత్రి సీతక్క ఆదేశాలతో గ్రామపంచాయతీ కార్యదర్శి గురువారం సిబ్బందితో శుభ్రత పనులు చేపట్టారు.

I NARESH, ETURUNAGARAM
Published on: 19 Nov 2026 3:43 PM IST
Mangapet
X

Mangapet: మంగపేట సీసీ రోడ్డుపై ఇసుక దుమ్ము.. మంత్రి సీతక్క ఆదేశాలతో శుభ్రం!

ములుగు జిల్లా: మంగపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డుపై పేరుకుపోయిన ఇసుక దుమ్ము, చెత్తాచెదారం వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది.

రోడ్డు కాంట్రాక్టర్ రోడ్డుపై పేరుకుపోయిన ఇసుక దుమ్ము, చెత్తను తొలగించకుండా వదిలేయడంతో వాహనాలు రాకపోకలు సాగించే సమయంలో భారీగా దుమ్ము లేస్తోంది. అదే విధంగా స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయకపోవడంతో వాహనాలు అధిక స్పీడ్ తో వెళ్లి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు తెలిపారు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇటీవల మంగపేట మండల పర్యటనకు వచ్చిన మంత్రి సీతక్క ఈ సమస్యపై స్పందించి, సంబంధిత అధికారులను వెంటనే రోడ్డును శుభ్రం చేయించాలని ఆదేశించారు.

మంత్రి ఆదేశాలతో స్పందించిన గ్రామపంచాయతీ కార్యదర్శి, గంపోనిగూడెం గ్రోమోర్ సెంటర్ నుంచి మంగపేట సెంటర్ వరకు రోడ్డుపై పేరుకుపోయిన ఇసుక దుమ్ము, చెత్తాచెదారాన్ని పంచాయతీ సిబ్బందితో తొలగించే పనులు చేపట్టారు.

రోడ్ల నిర్మాణంతో పాటు వాటి పరిశుభ్రతను కూడా నిరంతరం పర్యవేక్షించాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

I NARESH, ETURUNAGARAM

I NARESH, ETURUNAGARAM