Mallampalli: రోడ్డు పక్కన ఇసుక లారీల పార్కింగ్‌తో ప్రజల అవస్థలు
Mallampalli: మల్లంపల్లిలో రోడ్డు పక్కన ఇసుక లారీల పార్కింగ్‌తో ప్రమాదాల ముప్పు. ఇరుకుగా మారిన రహదారి. ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేయాలని ప్రజల డిమాండ్.
Mallampalli: రోడ్డు పక్కన ఇసుక లారీల పార్కింగ్‌తో ప్రజల అవస్థలు
మల్లంపల్లి: మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పక్కన లారీలను ఇష్టారాజ్యంగా నిలిపివేస్తుండటంతో ప్రయాణికులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
ముఖ్యంగా రాత్రివేళల్లో భారీ వాహనాల పార్కింగ్‌తో రహదారి ఇరుకుగా మారి ప్రమాదాల ముప్పు ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి లారీలకు ప్రత్యేక పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసి, రహదారి పక్కన పార్కింగ్‌ను నియంత్రించాలని కోరుతున్నారు.




