Warangal: వరంగల్‌లో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు!
Warangal: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా వరంగల్ కాశిబుగ్గ సర్కిల్ వద్ద జాతీయ జెండా ఆవిష్కరించిన మాజీ మేయర్ తక్కలపల్లి రాజేశ్వరరావు, బీఆర్ఎస్/బీజేపీ నేతలు.
Warangal: వరంగల్‌లో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు!
Warangal: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాశిబుగ్గ సర్కిల్ వద్ద భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులతో కలిసి జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మేయర్ తక్కలపల్లి రాజేశ్వరరావు గారు మరియు బిజెపి రాష్ట్ర నాయకులు వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ శ్రీ ఎర్రబెల్లి ప్రదీప్ రావు నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించేందుకు పోరాడిన వీరుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది.
వీరితోపాటు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వన్నాల వెంకటరమణ, సీనియర్ నాయకులు సముద్రాల పరమేశ్వర్, మల్లాడి తిరుపతిరెడ్డి మరియు తదితర స్థానిక నాయకులు పాల్గొన్నారు.




