Mahabubabad: క్షయ రహిత సమాజమే అందరి లక్ష్యం: డాక్టర్ అర్జున్
Mahabubabad: క్షయ రహిత సమాజమే అందరి లక్ష్యమని మహబూబాబాద్ జిల్లా టీబీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ అర్జున్ పేర్కొన్నారు. 13 టీబీ రహిత గ్రామాల సర్పంచులను సన్మానించారు.
Mahabubabad: క్షయ రహిత సమాజమే అందరి లక్ష్యం: డాక్టర్ అర్జున్
మహబూబాబాద్ జిల్లా: టీబి ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం ఐ డి ఓ సి కార్యాలయంలో ని కాన్ఫరెన్స్ హాలులో అన్ని మండలాల ఎంపీడీవోలతో కలిసి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డ ఆవిష్కరించిన జోష్ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రోగ్రాం అధికారి టీబి కి అన్ని రకాల పరీక్షలు చికిత్స ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తిగా ఉచితంగా లభిస్తుందని తెలిపారు.
టీబీ వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల ప్రభుత్వం ₹1000 పోషక ఆహార నిమిత్తం అందిస్తుందని, ప్రతి ఒక్కరు టీబి పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు అవగాహనతోనే టీబి అంతం చేయవచ్చని టిబి అంతం చేయడం కొరకు అందరు భాగస్వాములు కావాలని అన్నారు.
కార్యక్రమంలో భాగంగా టీబి రహిత గ్రామపంచాయతీలు గా ఎంపికైన 13 మంది సర్పంచులను సన్మానించడం జరిగింది . జిల్లాలో అన్ని గ్రామ పంచాయతీలను టీబి రహిత గ్రామపంచాయతీగా తీర్చడమే లక్ష్యం అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవోలు పంచాయతీ కార్యదర్శులు గ్రామ సర్పంచులు టీబి ముఖ్య సిబ్బంది పాల్గొన్నారు.




