Gudur: గూడూరు మండలంలో 28 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు!

Gudur: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో విధులకు గైర్హాజరవుతున్న 28 మంది ఉపాధ్యాయులకు కలెక్టర్ స్నేహ శబరిష్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

B NARASIMHA, GUDUR
Published on: 7 Oct 2026 8:40 AM IST
Gudur
X

Gudur: గూడూరు మండలంలో 28 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు!

Gudur: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో విధులకు గైర్హాజరవుతూ, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న 28 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పాఠశాలల పర్యవేక్షణలో భాగంగా గుర్తించిన లోపాల ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. నిర్దేశిత సమయంలోగా నోటీసులకు తగిన వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో శాఖాపరమైన చర్యలు తప్పవని ఆదేశించినట్లు సమాచారం.

ఈ అంశంపై స్పష్టత కోసం మండల విద్యాశాఖ అధికారి సుజాత ను సంప్రదించగా, వివరణ ఇచ్చేందుకు అమె నిరాకరించారు. ఉపాధ్యాయులపై తీసుకున్న చర్యలు, నోటీసుల అంశంపై మాట్లాడటానికి అధికారి సుముఖత చూపకపోవడం మండలంలో చర్చనీయాంశంగా మారింది.

విదుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఉపాధ్యాయులను రక్షించేది ఎవరు. గత కొన్ని నెలలుగా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ప్రభుత్వ పాఠశాలలను గాలికి వదిలేసిన ఉపాధ్యాయులను మండలంలో కొంతమంది అధికారులు సహకరిస్తూ వారి రక్షిస్తున్నారని ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. పాఠశాలలను పర్యవేక్షించి ఉపాధ్యాయుల విధులను సక్రమంగా ఉంచవలసిన కొంతమంది పై అధికారులు ఆ ఉపాధ్యాయులు ఇచ్చే తాయిలాలను తీసుకొని వారిని రక్షిస్తున్నారని ఘాటుగానే విమర్శిస్తున్నారు.

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ పాఠశాలలను గాలికి వదిలేసిన ఉపాధ్యాయులను షోకాజ్ నోటీస్ కాకుండా వారిపై తగిన చర్యలు తీసుకోవాలని వివిధ సంఘ నాయకులు కోరుతున్నారు.

B NARASIMHA, GUDUR

B NARASIMHA, GUDUR