Bayyaram: బయ్యారం సత్యనారాయణపురం ఎక్స్ రోడ్డు వద్ద పోలీసుల ఆకస్మిక నాకాబంది!

Bayyaram: మహబూబాబాద్ బయ్యారం సత్యనారాయణపురం ఎక్స్ రోడ్డు వద్ద పోలీసులు నాకాబంది నిర్వహించారు. వాహనాలు, అనుమానితుల తనిఖీ, సైబర్ క్రైమ్‌పై అవగాహన.

NARASIMHARAO, BAYYARAM
Published on: 23 Oct 2026 8:00 PM IST
Bayyaram
X

Bayyaram: బయ్యారం సత్యనారాయణపురం ఎక్స్ రోడ్డు వద్ద పోలీసుల ఆకస్మిక నాకాబంది!

బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో సత్యనారాయణపురం X రోడ్డు SP Dr. శబరిష్ ips ఆదేశానుసారం , DSP తిరుపతి రావు సూచనలతో గార్ల బయ్యారం CI రవీందర్ ,బయ్యారం SI ప్రశాంత్ బాబు సిబ్బందితో కలిసి వద్ద నాకా బంధి నిర్వహించారు.

ఆకస్మిక తనికీలు నిర్వహించి అనుమానిత వ్యక్తుల కదలికలు,ద్విచక్ర వాహనాలు, కార్లు,RTC బస్సులను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టి ఫింగర్ ప్రింట్ డివైస్ లతో తనకీలు చేసి, సరైన పత్రాలు లేని వాహనాలు సీజ్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు

ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహించి నేర నియంత్రణకు కృషి చేస్తామని గార్ల బయ్యారం CI రవీందర్ తెలియజేశారు.. వాహనదారులకు సైబర్ క్రైమ్, మత్తు పదార్థాల రవాణా పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాత్రి వేళల్లో సైతం పెట్రోలింగ్ నిర్వహించి అనుమానితులను తనికీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బయ్యారం పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు..

NARASIMHARAO, BAYYARAM

NARASIMHARAO, BAYYARAM